ఢిల్లీలో సినీ ఫక్కీలో దాడి... పోలీసు కస్టడీలో ఉన్న నిందితుడ్ని విడిపించుకెళ్లిన దుండగులు
- గతేడాది అరెస్టయిన గ్యాంగ్ స్టర్ కుల్ దీప్
- చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు
- ఆసుపత్రి వద్ద కాపు కాసిన క్రిమినల్ గ్యాంగ్
- పోలీసులపై కాల్పులు.. ఒక గ్యాంగ్ స్టర్ మృతి
పోలీసులకు చిక్కిన ముఠా సభ్యుడ్ని విడిపించేందుకు ఇతర గ్యాంగ్ స్టర్లు దాడులకు పాల్పడడం అనేక సినిమాల్లో చూస్తుంటాం. ఇప్పుడలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. కుల్ దీప్ అలియాస్ ఫజ్జా ఓ కరుడగట్టిన నేరస్తుడు. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జతిందర్ గోగి ముఠాలో కుల్ దీప్ కీలక సభ్యుడు. అతడ్ని గతేడాది పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అనారోగ్యం బారినపడడంతో పోలీసులు ఎస్కార్టు సాయంతో కుల్ దీప్ ను ఢిల్లీ జీటీబీ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఈ విషయం జతిందర్ గోగి గ్యాంగ్ కు తెలియడంతో.... కుల్ దీప్ ను పోలీసుల కస్టడీ నుంచి తప్పించేందుకు ప్లాన్ చేశారు. పోలీసుల కంటే ముందే ఆసుపత్రి వద్దకు చేరుకుని వాహనాల్లో కాపు కాశారు. కుల్ దీప్ ను తీసుకువస్తున్న పోలీసు వాహనం ఆసుపత్రి వద్దకు రాగానే ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. సాయుధులైన పోలీసులు కూడా వెంటనే స్పందించి ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక గ్యాంగ్ స్టర్ మరణించాడు. మరో గ్యాంగ్ స్టర్ గాయపడ్డాడు.
అయితే, ఈ ఘటనలో జతిందర్ గ్యాంగ్ అనుకున్నది సాధించింది. పోలీసు కస్టడీలో ఉన్న కుల్ దీప్ ను విడిపించుకుని అక్కడ్నించి పరారైంది. ప్రస్తుతం ఈ గ్యాంగ్ కోసం తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.