'సైరా' చిత్రం ద్వారా చిరంజీవి ఉయ్యాలవాడను గుర్తుచేస్తే... సీఎం జగన్ ఆయన కీర్తిని శాశ్వతం చేశారు: అంబటి

  • కర్నూలు ఎయిర్ పోర్టు ప్రారంభించిన సీఎం జగన్
  • ఉయ్యాలవాడ ఎయిర్ పోర్టుగా నామకరణం
  • హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి
  • గతంలో ఉయ్యాలవాడ చరిత్ర ఆధారంగా 'సైరా' చిత్రం
  • ఉయ్యాలవాడ నరసింహారెడ్డిగా నటించిన చిరంజీవి
కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విమానాశ్రయానికి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టగా, మెగాస్టార్ చిరంజీవి సంతోషం వెలిబుచ్చారు. దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. నాడు చిరంజీవి 'సైరా' చిత్రం ద్వారా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గుర్తు చేశారని పేర్కొన్నారు. సీఎం జగన్ ఇప్పుడు కర్నూలు ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ పేరుపెట్టడం ద్వారా ఆయన కీర్తిని శాశ్వతం చేశారని కొనియాడారు.

కాగా, ఈ విమానాశ్రయం నుంచి ఈ నెల 28 నుంచి విమానాల రాకపోకలు షురూ కానున్నాయి. ఇక్కడి నుంచి ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ విశాఖ, బెంగళూరు, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడపనుంది. మున్ముందు విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ నగరాలకు కూడా విమాన సర్వీసులు నడిపే అవకాశాలున్నాయి.


More Telugu News