ల‌క్ష మందితో ష‌ర్మిల స‌భ నిర్వ‌హించాల‌నుకుంటే 6 వేల మందికే అనుమ‌తి!

  • ఏప్రిల్ 9న ఖమ్మంలో తొలి బహిరంగసభ
  • అన్ని జిల్లాల ముఖ్యనేతలతో ష‌ర్మిల త్వ‌ర‌లో సమావేశం
  • సభకు జనసమీకరణపై చ‌ర్చ‌లు
  • సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తి
తెలంగాణలో కొత్త రాజ‌కీయ‌ పార్టీ ప్రారంభించనున్న వైఎస్ షర్మిల ఏప్రిల్ 9న ఖమ్మంలో తొలి బహిరంగసభను నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. స‌భ‌కు పోలీసులు ఎట్ట‌కేల‌కు అనుమతించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని అన్ని జిల్లాల ముఖ్యనేతలతో ష‌ర్మిల‌ సమావేశం కానున్నారు.

సభకు జనసమీకరణతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అనంత‌రం సంకల్ప సభ వాల్ పోస్టర్‌ను విడుదల చేస్తారు. అయితే, ఈ స‌భ‌ను ష‌ర్మిల‌ లక్ష మందితో నిర్వ‌హించాల‌ని భావిస్తే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  6,000 మందితో సభ నిర్వహించుకునేందుకు ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు.

అంతేకాదు, స‌భ‌లోనూ క‌రోనా నిబంధనలు పాటిస్తూ సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటలలోపే సభ నిర్వహించుకోవాలని పోలీసులు చెప్పారు. దీంతో ఈ స‌భ‌కు ఎంత మందిని అనుమ‌తిస్తార‌న్న విష‌యంపై సందిగ్ధ‌త నెల‌కొంది. స‌భ‌తో తొలిసారి తెలంగాణ‌ ప్రజల ముందుకు రావాల‌నుకుంటున్న ష‌ర్మిల‌కు ఆదిలోనే అవాంత‌రాలు ఎదువుతున్నాయి.


More Telugu News