కరోనా టీకా తొలి డోసు వేయించుకున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్

  • సంజయ్ దత్ కూడా నిన్ననే తీసుకున్న టీకా
  • ఇప్పటికే తొలి డోస్ తీసుకున్న పలువురు బాలీవుడ్ నటులు
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ‘భాయిజాన్’
బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ నిన్న కరోనా టీకా తొలి డోసు వేయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతకుముందు అతడు ఆసుపత్రిలో ఉన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయితే, వ్యాక్సిన్ తీసుకున్నట్టు వెల్లడించడంతో అందుకోసమే అతడు ఆసుపత్రికి వెళ్లినట్టు నిర్ధారణ అయింది.

సల్మాన్‌ఖాన్ కాకుండా ఇంకా బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్‌దత్ కూడా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నాడు. ముంబైలో వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోలను 61 ఏళ్ల ‘మున్నాభాయ్’ ట్విట్ చేశాడు. బీకేసీ వ్యాక్సిన్ సెంటర్‌లో టీకా వేయించుకున్నట్టు పేర్కొన్నాడు. గొప్ప పనిచేస్తున్నారంటూ డాక్టర్ ధేరే, ఆయన బృందాన్ని సంజయ్ ప్రశంసించాడు.

కాగా, హేమామాలిని, అనుపమ్ ఖేర్, జానీ లివర్, సైఫ్ అలీఖాన్, కమలహాసన్, సతీశ్ షా తదితరులు కూడా వ్యాక్సిన్ షాట్లు తీసుకున్నారు.


More Telugu News