నేడు కర్నూలు విమానాశ్రయం ప్రారంభం.. జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్
- పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించిన వైనం
- 12.18 గంటలకు విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న సీఎం
- అంతకంటే ముందు వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న జగన్
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన విమానాశ్రయాన్ని నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఉదయం 11.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకునే జగన్ తొలుత జాతీయ జెండాను, ఆ తర్వాత వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
అనంతరం 12.18 గంటలకు విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరో కార్యక్రమంలో 12.22 గంటలకు ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను ఆవిష్కరిస్తారు. ఈ నెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులు ప్రారంభించనుంది. కాగా, ఈ విమానాశ్రయాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించడం విశేషం.