దేశంలో అత్యధిక కరోనా కేసులున్న టాప్ 10 జిల్లాలు ఇవే!
- దేశంలో 3,68,457కి చేరుకున్న యాక్టివ్ కేసులు
- పూణె జిల్లాలో 43,590 కేసులు
- బెంగళూరు అర్బన్ జిల్లాలో 10,766 యాక్టివ్ కేసులు
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశంలో యాక్టివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోసారి మూడున్నర లక్షల మార్కును దాటిన యాక్టవ్ కేసులు... 3,68,457కి చేరుకున్నాయి. వీటిలో అత్యధిక కేసులు 10 జిల్లాల్లో నమోదయ్యాయి. ఈ 10 జిల్లాల్లో తొమ్మిది మహారాష్ట్ర జిల్లాలు ఉండగా, కర్ణాటకకు చెందిన ఒక జిల్లా ఉంది. టాప్ 10 జిల్లాల్లో పూణె అగ్రస్థానంలో ఉంది.
జిల్లాలు, యాక్టివ్ కేసుల వివరాలు:
మరోవైపు మహారాష్ట్ర, పంజాబ్ లతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.
జిల్లాలు, యాక్టివ్ కేసుల వివరాలు:
- పూణె - 43,590
- నాగపూర్ - 33,160
- ముంబై - 26,599
- థానే - 22,513
- నాసిక్ - 15,710
- ఔరంగాబాద్ - 15,380
- బెంగళూరు అర్బన్ - 10,766
- నాందేడ్ - 10,106
- జల్గావ్ - 6,087
- అకోలా - 5,704
మరోవైపు మహారాష్ట్ర, పంజాబ్ లతో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి.