తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం.. ముట్టడికి బీజేపీ, కాంగ్రెస్ యత్నం
- సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనలు
- నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలన్న రైతు ఐక్య వేదిక
- హామీలను అమలు చేయాలన్న కాంగ్రెస్ నేతలు
- పలువురిని అరెస్టు చేసి తరలించిన పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతోన్న నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలతో పాటు పలు సంఘాలు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆయా పార్టీల నేతలు డిమాండ్ చేశారు.
నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరవాలని రైతు ఐక్య వేదిక ఆధ్వర్యంలో పలువురు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. దీంతో వారిలో పలువురిని పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లారు.
మరోపక్క, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్‌తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలను ఓటు బ్యాంకుగా వాడుకొని వదిలేసిందని బీజేపీ ఎస్సీ మోర్చా అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఎస్సీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తోంది.