రూ.450 కోట్లకు అమ్ముడుపోయిన పెయింటింగ్ ఇది!
- ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్
- దుబాయ్‌లో వేలం
- 'ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ' పేరిట పెయింటింగ్
- రూపొందించిన బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ
ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ ఇది. దీన్ని తాజాగా దుబాయ్‌లో వేలం వేయగా దాదాపు రూ.450 కోట్లకు ( 62 మిలియన్ డాలర్లకు) అమ్ముడుపోయింది. 'ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ' పేరిట బ్రిటిష్ ఆర్టిస్ట్ సచా జాఫ్రీ ఈ పెయింటింగ్‌ను వేశాడు. ఇందుకోసం 1,065 పెయింట్ బ్రష్‌లు, 6,300 లీటర్ల పెయింట్స్ ను ఆయన వాడాడు.
దుబాయ్‌లోని అట్లాంటీస్ హోటల్‌లో సుమారు ఏడు నెలల పాటు కష్టపడి ఆయన ఈ పెయింటింగ్ వేశాడు. కరోనా విజృంభణ సమయంలో తన సమయాన్ని ఈ పెయింటింగ్ కోసమే వినియోగించినట్లు ఆయన తెలిపాడు.
70 ముక్కలుగా వేసిన ఈ పెయింటింగ్ ను వేలంలో ఫ్రెంచ్‌కు చెందిన ఆండ్రీ అబ్దున్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కాన్వాస్ పెయింటింగ్ అయిన 'ద జర్నీ ఆఫ్ హ్యుమనిటీ గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది.