గుట్టు చప్పుడు కాకుండా చైనా అప్పులు.. ఎంతో తెలుసా?
- కమ్యూనిస్ట్ దేశానికి రూ.1.67 కోట్ల కోట్ల అప్పులు
- ఈ ఏడాది మరింత పెరుగుతాయంటున్న నిపుణులు
- వడ్డీలకే ఏటా 7.8 లక్షల కోట్ల చెల్లింపులు
- బయటకు తెలియకుండా బాండ్ల ద్వారా రుణాలు
- స్థానిక ప్రభుత్వాలపై కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఒత్తిళ్లు
డ్రాగన్ దేశం చైనా అప్పులను దాచిపెడుతోందా? అభివృద్ధి పేరిట స్థానిక ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తీసుకునేందుకు కమ్యూనిస్ట్ పార్టీ ఇబ్బంది పెడుతోందా? అని అంటే.. అవుననే సమాధానాలు వస్తున్నాయి. గత ఏడాది నాటికి చైనా అప్పులు 2.3 లక్షల కోట్ల డాలర్లని (రూ.1.67 కోట్ల కోట్లు) ప్రభుత్వానికి చెందిన మేధో సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది అవి మరింత పెరిగే అవకాశముందని అంటోంది.
మౌలిక వసతుల కల్పన కోసం కమ్యూనిస్ట్ ప్రభుత్వం.. స్థానిక ప్రభుత్వాలను (ప్రావిన్సులు) ఒత్తిడి చేస్తోందని చెబుతోంది. ఆ ఒత్తిడితోనే మహమ్మారి సమయంలోనూ బడ్జెట్ కు మించి స్థానిక ప్రభుత్వాలు అప్పులు చేశాయని, దీంతో అప్పులు 6 శాతం పెరిగాయని ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ పైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ కు చెందిన ఆర్థిక పరిశోధకుడు లూ లీ అన్నారు.
మౌలిక వసతులు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వ సంస్థలు భారీగా రుణాలు తీసుకున్నాయని, రుణాలు తిరిగి చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి గ్యారెంటీలూ పెట్టాయని చెప్పారు. స్థానిక ప్రభుత్వాల బాండ్ల ద్వారా రుణాలను పెద్ద మొత్తంలో తీసుకున్నాయన్నారు. తద్వారా బ్యాలెన్స్ షీట్ లో ఆ లెక్కలను చెప్పాల్సిన పని లేకుండానే లోన్లు పొందాయన్నారు.
2035 నాటికి భారీ ఆర్థిక వృద్ధిని నమోదు చేసేందుకు చైనా లక్ష్యాలు పెట్టుకుందని, అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు నిర్ణయించుకుందని లీ లూ అన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమయ్యే పరిస్థితులు లేవని అన్నారు. అందుకు అవసరమైన బడ్జెట్ లేదంటున్నారు. పెట్టుబడులను పెంచాలన్న చైనా ప్రభుత్వ ఒత్తిడి మేరకు స్థానిక ప్రభుత్వాలు ఇబ్బడి ముబ్బడిగా పైకి కనిపించని అప్పులు చేస్తున్నాయన్నారు.
దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి ఎదురు గాలులు తప్పవని ఆయన తేల్చి చెప్పారు. వయసు మీరుతున్న జనాభా సహా బాహ్య కారణాలూ అందుకు ఆజ్యం పోస్తాయన్నారు. వాస్తవానికి ఇలాంటి అప్పులపై చైనా స్థానిక ప్రభుత్వాల వద్ద ఎలాంటి అధికారిక పద్దులు ఉండవు. పద్దులను నిర్వహించడం అక్కడి చట్టాలకు వ్యతిరేకం. వివిధ ఆర్థిక సంస్థల అంచనాలు, గణాంకాల ద్వారానే చైనా అప్పుల వివరాలు బయటకు తెలుస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫైనాన్స్ అండ్ డెవలప్ మెంట్ అప్పుల లెక్కలను వెల్లడించింది. స్థానిక ప్రభుత్వాలు బాండ్ల ద్వారా తీసుకున్న రుణాలు, ప్రభుత్వ రుణ సంస్థలు, ఇన్సూరెన్స్ సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలనే అప్పుల్లో లెక్క గట్టింది. అయితే, బ్యాంకు లోన్లను మాత్రం ఈ గణాంకాల్లో చేర్చలేదు. వాణిజ్య ప్రాజెక్టులకే ఎక్కువగా బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుంటారన్న కారణంతో వాటిని కలపలేదు. వాటినీ కలిపితే అప్పు మరింత ఎక్కువగా ఉండే అవకాశముంది.
ఈ అప్పులకే చైనా ప్రభుత్వం ఏటా 70 వేల కోట్ల యువాన్లను (సుమారు రూ.7.8 లక్షల కోట్లు) వడ్డీల రూపంలోనే కడుతోందని లీ లూ అంటున్నారు. దీని వల్ల చైనా ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ముప్పు ఏర్పడుతోందని అన్నారు. దాదాపు అన్ని ఆర్థిక సంస్థల నుంచి చైనా రుణాలు తీసుకుంటోందని అన్నారు.