బైక్ లు, స్కూటర్ల ధరలను పెంచిన హీరో మోటోకార్ప్!
- ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధరలు అమలులోకి
- ఉత్పత్తి వ్యయం పెరగడమే కారణం
- రూ. 2,500 వరకూ ధరల పెంపు
ప్రపంచంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న సంస్థల్లో ఒకటైన హీరో మోటో, తాము మార్కెటింగ్ చేస్తున్న బైక్ లు, స్కూటర్ల ధరలను పెంచుతున్నట్టు వెల్లడించింది. పెంచిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని స్టాక్ ఎక్స్ఛేంజ్ లకు ఇచ్చిన సమాచారంలో సంస్థ పేర్కొంది. ఉత్పత్తి వ్యయం పెరుగుతూ ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
ఇదే సమయంలో వినియోగదారులమీద ఎక్కువగా భారం మోపడం లేదని, సంస్థ ఖర్చులను సైతం తగ్గించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టామని తెలిపింది. వివిధ రకాల బైక్ లపై ఎంచుకునే వేరియంట్ ను బట్టి రూ. 2,500 వరకూ పెరుగుదల ఉంటుందని చెప్పిన హీరో మోటో, ఏ వేరియంట్ పై ఏ మేరకు ధరను పెంచనున్నామన్న విషయాన్ని మాత్రం పేర్కొనలేదు. కాగా, మంగళవారం నాడు కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సైతం ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకుంది.