అప్పులు తీర్చని రైతుల ఫొటోలు, పేర్లను నడి వీధిలో ఫ్లెక్సీల్లో వేయించిన అధికారులు!
- మెదక్ జిల్లా కోఆపరేటివ్ అధికారులు అత్యుత్సాహం
- రైతుల పరువు తీసే ప్రయత్నం
- పాపన్నపేట రైతులు రుణాలు చెల్లించలేదని దారుణం
- భూములు వేలం వేయిస్తామని బెదిరింపులు
మెదక్ జిల్లా కోఆపరేటివ్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ రైతుల పరువు తీసే ప్రయత్నం చేశారు. పాపన్నపేట మండలంలో రుణాలు చెల్లించని రైతుల పేర్లు, ఫొటోలతో నడి వీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
కొందరు రైతులు వ్యవసాయ పైపులైన్లు, గేదెలు, కోళ్ల ఫారాల ఏర్పాటు కోసం గతంలో రుణాలు తీసుకున్నారు. అయితే, గత ఏడాది కరోనా విజృంభణ, భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, అప్పులు తీర్చడానికి సమయం ఇవ్వాలని రైతులు కోరారు.
తమపై కనికరం చూపకుండా వారి పేర్లు, ఫొటోలతో నడి వీధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కాకుండా డబ్బు చెల్లించకపోతే వారి భూములు వేలం వేస్తామని హెచ్చరించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము రైతుల ఫొటోలతో ఫ్లెక్సీలు ప్రింట్ చేయించామని బ్యాంకు అధికారులు అంటున్నారు.