తిరుమల శ్రీనివాసుని హుండీలో చోరీకి ప్రయత్నం
- రూ. 30 వేలు దొంగిలించే ప్రయత్నం
- సీసీటీవీ కెమెరాల్లో గుర్తించిన విజిలెన్స్ సిబ్బంది
- పట్టుకుని వన్ టౌన్ పోలీసులకు అప్పగింత
తిరుమల శ్రీనివాసుని హుండీలో చోరీ ప్రయత్నం జరగడం కలకలం రేపింది. భక్తితో యాత్రికులు తమ మొక్కులను స్వామి దర్శనం తరువాత హుండీలో సమర్పించుకుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, ఓ వ్యక్తి, హుండీలో నుంచి రూ. 30 వేలను చోరీ చేయగా, సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న విజిలెన్స్ అధికారుల కంటపడింది. వెంటనే వారి ఆదేశాల మేరకు సెక్యూరిటీ సిబ్బంది సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి తిరుమల వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. అతను ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడన్న విషయమై విచారణ జరుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు.