24 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

  • మూడు వారాలపాటు స్థిరంగా కొనసాగిన ధరలు
  • నేడు పెట్రోలుపై 18 పైసలు, డీజిల్‌పై 17 పైసలు తగ్గింపు
  • ముంబైలో అత్యధికంగా లీటరు పెట్రోలు రూ. రూ.97.40
దాదాపు మూడు వారాలపాటు స్థిరంగా కొనసాగిన పెట్రో రేట్లు నేడు స్వల్పంగా తగ్గాయి. గత నెల 27న చివరిసారి ఢిల్లీలో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయికి పెట్రో ధరలు చేరుకున్నాయి. పెట్రోలు ధర లీటర్‌కు రూ. 91.17కు చేరుకుంది. తాజాగా నేడు లీటరు పెట్రోలుపై 18 పైసలు తగ్గింది. దీంతో దేశ రాజధానిలో లీటరు రూ.90.99కి దిగొచ్చింది. డీజిల్‌పై 17 పైసలు తగ్గింది. ఫలితంగా ఇప్పుడు లీటర్ పెట్రోలు ధర రూ.81.30కు చేరుకుంది.

తాజాగా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 94.61గా ఉండగా, డీజిల్ ధర రూ. 88.67గా ఉంది. ముంబైలో పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా రూ.97.40, రూ.88.42గా ఉండగా, చెన్నైలో రూ.92.95, రూ.86.29గా, కోల్‌కతాలో రూ.91.18, రూ.84.14గా ఉంది.


More Telugu News