రెండోసారి కరోనా బారిన ‘మహా’ మంత్రి ధనంజయ్ ముండే
- గతేడాది జూన్‌లో కరోనా బారినపడి కోలుకున్న మంత్రి
- ఉద్ధవ్ కేబినెట్‌లో సామాజిక న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు
- తనను కలిసిన అందరూ పరీక్షలు చేయించుకోవాలని సూచన
కరోనా నుంచి కోలుకున్న కొన్ని నెలలకే మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండే మరోమారు ఆ మహమ్మారి బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నేత అయిన ధనంజయ్ ముండే ఉద్ధవ్ థాకరే కేబినెట్‌లో సామాజిక న్యాయశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
గతేడాది జూన్‌లో కరోనా బారినపడిన మంత్రి కోలుకున్నారు. తాజాగా, తనకు మరోమారు వైరస్ సంక్రమించిందని, గత కొన్ని రోజులుగా తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. భయపడాల్సింది ఏమీ లేదని అన్నారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని మంత్రి మరాఠాలో ట్వీట్ చేశారు.