రానున్న మూడు రోజులూ భానుడి భగభగలే... హెచ్చరించిన వాతావరణ శాఖ!

  • 3 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రత
  • 40 డిగ్రీలను దాటనున్న ఎండ వేడిమి
  • రాయలసీమలో జల్లులకు అవకాశం
వచ్చే మూడు రోజుల్లో ఎండల తీవ్రత మరింతగా పెరగనుందని, సాధారణం కంటే, రెండు నుంచి మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ఉత్తరాది నుంచి తేమగాలులు వీస్తున్నాయని, ఇదే సమయంలో బంగాళాఖాతం నుంచి వస్తున్న పొడిగాలులతో అధిక పీడనం ఏర్పడి, ఎండలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు.

 ఉష్ణోగ్రతలు నడి వేసవిని తలపిస్తూ, 40 డిగ్రీలను దాటవచ్చని అధికారులు అంచనా వేశారు. ఇదే సమయంలో రాయలసీమలో తేలికపాటి జల్లులకు అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. నెలాఖరులోగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, ఎండ వేడిమి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు.


More Telugu News