సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బాలీవుడ్ భామని ఫైనల్ చేస్తున్న శంకర్
- గోదావరీ తీరంలో నాని సినిమా షూటింగ్
- రీమేక్ చిత్రానికి 'బుట్టబొమ్మ' టైటిల్
* ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి విదితమే. సైన్స్ ఫిక్షన్ కథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇక ఇందులో కథానాయిక పాత్రకు కియరా అద్వానీ ఎంపిక దాదాపు పూర్తయిందని సమాచారం.
* నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'శ్యామ్ సింగరాయ్' చిత్రం షూటింగ్ ప్రస్తుతం గోదావరీ తీరంలో జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి వద్ద జరుగుతున్న ఈ షూటింగులో నాని, సాయిపల్లవి తదితరులు పాల్గొంటున్నారు.
* మలయాళంలో హిట్టయిన 'కప్పేల' చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో రీమేక్ చేస్తోంది. నవీన్ చంద్ర, విశ్వక్ సేన్ హీరోలుగా నటించే ఈ చిత్రంలో అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా నటించే అవకాశం వుంది. ఇక ఈ చిత్రానికి 'బుట్టబొమ్మ' అనే టైటిల్ని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తోంది.