రానా ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా
- కరోనా ప్రభావంతో తీవ్రంగా దెబ్బతిన్న చిత్రపరిశ్రమ
- ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సూచనలు
- సరిగ్గా ఇదే సమయంలో రెండో వేవ్
- మరోసారి సినిమాలపై ప్రభావం పడే అవకాశం
- కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో వాయిదా
రానా హీరోగా తెరకెక్కిన ‘అరణ్య’ మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. తమిళంలో ‘కాదన్’, హిందీలో ‘హాథీ మేరీ సాథీ’ పేర్లతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. కాగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ‘హాథీ మేరీ సాథీ’ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ మంగళవారం వెల్లడించింది. కొవిడ్19 మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఇక తెలుగులో ‘అరణ్య’, తమిళంలో ‘కాదన్’ యథావిధిగా మార్చి 26న విడుదలవుతాయని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత చిత్రసీమ తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కేసులు పెరుగుతుండడం చిత్ర పరిశ్రమను మరోసారి ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది. కరోనా దెబ్బకు దాదాపు తొమ్మిది నెలల పాటు సినిమాలు ఎక్కడివక్కడే స్తంభించిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. సినీ రంగం ఇప్పుడిప్పుడే మళ్లీ పాత కళ సంతరించుకుంటున్నట్లు కనిపిస్తోంది. సరిగ్గా ఇదే తరుణంలో కరోనా కేసులు పెరగడం ఆందోళనగా మారింది.