ఏప్రిల్ నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు!

  • ఏప్రిల్ లో బ్యాంకులకు 12 సెలవులు!
  • ఏప్రిల్ 1న వార్షిక ఖాతాల మూసివేత
  • ఆదివారాలతో కలిపి భారీగా సెలవులు
  • ఏప్రిల్ నెలలో 18 పనిదినాలే!
ఏప్రిల్ మాసంలో బ్యాంకులకు అత్యధిక సంఖ్యలో సెలవులు వస్తున్నాయి. అంతేకాదు మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 మధ్య ఏకంగా 7 సెలవులు ఉన్నాయి. ఓవరాల్ గా ఏప్రిల్ నెలలో బ్యాంకులు పనిచేసేది 18 రోజులేనని తెలుస్తోంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్యాలెండర్ లో సెలవులను పేర్కొన్నారు.

ఏప్రిల్ లో బ్యాంకులకు ఏమేం సెలవులు ఉన్నాయంటే...

  • ఏప్రిల్ 1- వార్షిక ఖాతాల మూసివేత
  • ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే పండుగ
  • ఏప్రిల్ 4- ఆదివారం
  • ఏప్రిల్ 5- బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి
  • ఏప్రిల్ 10- రెండో శనివారం
  • ఏప్రిల్ 11- ఆదివారం
  • ఏప్రిల్ 13- ఉగాది పర్వదినం
  • ఏప్రిల్ 14- అంబేద్కర్ జయంతి
  • ఏప్రిల్ 18- ఆదివారం
  • ఏప్రిల్ 21- శ్రీరామనవమి
  • ఏప్రిల్ 24- నాల్గవ శనివారం
  • ఏప్రిల్ 25- ఆదివారం


More Telugu News