తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
- బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఉప ఎన్నికలు
- ఈ నెల 30 వరకు నామినేషన్లు
- 31న నామినేషన్ల పరిశీలన
- ఏప్రిల్ 3 వరకు ఉపసంహరణలకు అవకాశం
- ఏప్రిల్ 17న పోలింగ్
- మే 2న ఓట్ల లెక్కింపు
తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇచ్చారు. ఈ నెల 31న నామినేషన్లు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 3న తుదిగడువు. ఏప్రిల్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మే 2న ఓట్ల లెక్కింపు చేపడతారు.
కాగా, తిరుపతి పార్లమెంటు స్థానం బరిలో అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని రంగంలోకి దించగా, టీడీపీ కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మిని పోటీకి నిలిపింది. బీజేపీ-జనసేన కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. వైసీపీ పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతి చెందడంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.