రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్

  • తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలిపిన రేవంత్
  • హోం ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడి
తెలంగాణలో కరోనా మరోసారి పంజా విసురుతోంది. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి కరోనా సోకింది. టెస్టుల్లో తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని... దీంతో డాక్టర్ల సలహా మేరకు తాను హోం ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పారు. గత కొన్ని రోజులుగా తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. పరిస్థితిని తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, మాస్కులను విధిగా ధరించాలని ఆయన కోరారు. అంతేకాదు, విద్యాలయాల్లో పెద్ద సంఖ్యలో కేసులు బయటపడుతుండటంతో... పలు పాఠశాలలు ఈరోజు నుంచి మళ్లీ ఆన్ లైన్ క్లాసులను ప్రారంభించాయి.

మరోవైపు మళ్లీ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే, ప్రభుత్వం వైపు నుంచి దీనిపై ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.


More Telugu News