యువత చూడదగిన చక్కని సినిమా ఇది: 'శ్రీకారం'కు ఉప రాష్ట్రపతి ప్రశంసలు
- యువతలో స్ఫూర్తి రేకెత్తించే విధంగా ఉందని కితాబు
- సందేశాత్మక చిత్రం అని వ్యాఖ్యలు
- దర్శక నిర్మాతలకు, నటీనటులకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్
శర్వానంద్ హీరోగా వ్యవసాయం నేపథ్యంలో తెరకెక్కిన 'శ్రీకారం' చిత్రంపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. వ్యవసాయ పునర్ వైభవం కోసం గ్రామాల బాట పట్టండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా 'శ్రీకారం' చిత్రం ఉందని ప్రశంసించారు. కుటుంబం, ఊరు కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శకనిర్మాతలకు, నటీనటులకు శుభాకాంక్షలు అంటూ వెంకయ్యనాయుడు ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామాలకు అందించి, వ్యవసాయంతో జోడించి, పరస్పర సహకారంతో, ఆత్మవిశ్వాసంతో అన్నదాత ముందుకు వెళ్లవచ్చు అనే సందేశాన్ని 'శ్రీకారం' చిత్రం అందిస్తోందని వివరించారు. యువత చూడదగిన చక్కని చిత్రం శ్రీకారం అని కొనియాడారు.