అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్ సినీ నటుడు కార్తీక్
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడిన కార్తీక్
- ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
- చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స
- కరోనా పరీక్షల్లో కార్తీక్ కు నెగెటివ్
సీనియర్ సినీ నటుడు కార్తీక్ అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యారు. ఆయన శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు ఇటీవల చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కార్తీక్ చికిత్స పొందుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుండడంతో ఆయనకు కరోనా పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే ఆ పరీక్షల్లో నెగెటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.దీంతో ప్రస్తుతం నాన్-కొవిడ్ వార్డులో కార్తీక్ ను పరిశీలనలో ఉంచారు.
సీతాకోకచిలుక, అన్వేషణ, అభినందన వంటి చిత్రాలతో కార్తీక్ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. కాగా, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కార్తీక్ రాజకీయ ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. ఆయన బీజేపీ-అన్నాడీఎంకే కూటమి తరఫున ప్రచారం చేస్తున్నారు.