జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం 'జెర్సీ'... ఉత్తమ వినోద్మాక చిత్రంగా 'మహర్షి'

  • జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన కేంద్రం
  • నాని హీరోగా వచ్చిన జెర్సీకి నేషనల్ అవార్డు
  • ఉత్తమ ఎడిటర్ గా నవీన్ నూలి
  • ఉత్తమ కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం
  • ఉత్తమ నిర్మాణ సంస్థగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
కేంద్రం జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించింది. నాని హీరోగా వచ్చిన క్రికెట్ చిత్రం 'జెర్సీ' జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అంతేకాదు, 'జెర్సీ' చిత్రంతో ఉత్తమ ఎడిటర్ గా నవీన్ నూలి కూడా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహేశ్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం ఎంపికైంది. 'మహర్షి' చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలోనూ జాతీయ పురస్కారం లభించింది. రాజుసుందరం ఉత్తమ కొరియోగ్రాఫర్ గా ఎంపికయ్యారు.

ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ఎంపికైంది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు ఈసారి ఇద్దరికి పంచారు. తమిళ హీరో ధనుష్ (అసురన్), మనోజ్ బాజ్ పాయ్ (భోంస్లే)లను ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. ఉత్తమ నటిగా కంగన (ఝాన్సీ), ఉత్తమ దర్శకుడిగా సంజయ్ పూరన్ సింగ్ చౌహాన్ (బహత్తర్ హూరైన్) ఎంపికయ్యారు.


More Telugu News