ఉత్తుత్తి రాజీనామాలతో సొంత "గంట" మోగిస్తున్నారు: విజయసాయిరెడ్డి
- విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
- కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ ఓ ఎమ్మెల్యే రాజీనామా
- విమర్శనాత్మకంగా స్పందించిన విజయసాయిరెడ్డి
- ఉద్యమానికి "గంటలు" కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవల ఏపీలోని ఓ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ ఉద్యమానికి కొందరు "గంటలు" కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఉత్తుత్తి రాజీనామాలతో సొంత "గంట" మోగిస్తున్నారని, ఆ "గంట"లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధి లేదని విజయసాయి విమర్శించారు. ఆ "గంట" శబ్దాల వెనకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? అని వ్యాఖ్యానించారు. ఈ గంటే గతంలో విశాఖలో "భూగంట" మోగించలేదా? అని నిలదీశారు.