కరోనా ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • ఒత్తిడికి గురైన బ్యాంకింగ్, ఫైనాన్స్ సూచీలు
  • 86 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకెక్స్, ఫైనాన్స్ తదితర సూచీలు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు కోల్పోయి 49,771కు దిగజారింది. నిఫ్టీ 7 పాయింట్లు నష్టపోయి 14,793కు పడిపోయింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (2.38%), టీసీఎస్ (2.17%), సన్ ఫార్మా (2.07%), ఇన్ఫోసిస్ (1.87%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.75%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-4.33%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-2.95%), ఐసీఐసీఐ బ్యాంక్ (-2.23%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.55%), బజాజ్ ఫైనాన్స్ (-1.32%).


More Telugu News