సుప్రీంకోర్టుకు చేరిన తెలుగు అకాడమీ విభజన అంశం
- ఇంకా పరిష్కారం కాని తెలుగు అకాడమీ విభజన
- న్యాయస్థానంలోనే పరిష్కారం అన్న తెలంగాణ హైకోర్టు
- హైకోర్టు ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం
- అకాడమీ విభజన న్యాయపరిధిలోకి రాదంటూ పిటిషన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఏర్పాటైన తెలుగు అకాడమీ విభజన అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. 2014లో ఏపీ, తెలంగాణ విడిపోయినా... తెలుగు అకాడమీ విభజన, ఉద్యోగులు, ఆస్తుల పంపకాలపై ఏకాభిప్రాయం కుదరలేదు. ఇప్పుడీ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఇటీవలే ఉద్యోగుల పంపకం, ఆస్తులు-అప్పులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి వ్యవహారాలకు న్యాయస్థానాల్లోనే పరిష్కారం దొరుకుతుందని పేర్కొంది.
అయితే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. అకాడమీ విభజన అంశం న్యాయ పరిధిలోకి రాదని తన పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తెలుగు అకాడమీ పంపకాల విషయంలో ఇరు రాష్ట్రాలు చర్చించుకుని నెలరోజుల్లో ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. ఒకవేళ ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అప్పుడు తాము విచారణ చేపడతామని స్పష్టం చేసింది.