కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ సందర్భంగా రూ. 10 వేల అడ్వాన్స్!
- హోళీని ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చిన కేంద్రం
- అడ్వాన్స్ తీసుకునేందుకు మార్చి 31 చివరి తేది
- నెలకు రూ. 1000 చొప్పున తిరిగి చెల్లిస్తే సరిపోతుంది
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. హోళీ పండుగ సందర్భంగా ఉద్యోగులకు రూ.10వేలు అడ్వాన్సుగా ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 28 లేదా 29 తేదీల్లో హోళీ జరగనుంది. ఈ క్రమంలో హోళీని ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ కిందకు తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద అడ్వాన్సు తీసుకునేందుకు మార్చి 31వ తేదీని చివరి తేదీగా ప్రకటించింది.
అడ్వాన్సు తీసుకున్న ఉద్యోగులు నెలకు రూ. 1000 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. డబ్బు అవసరమున్న ఉద్యోగులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు కేంద్ర ఉద్యోగులు, రిటైర్డ్ పెన్షనర్లకు ఊరట కలిగించే మరో నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం తీసుకుంది. పెండింగ్ లో ఉన్న మూడు విడతల డీఏ, డీఆర్ ను జూలై నుంచి పునరుద్ధరించాలని నిర్ణయించింది.