యువీ ‘బ్రోకెన్ బాహుబలి’.. వీడియో ఇదిగో!
- బాహుబలి పాటతో హోటల్ సిబ్బంది స్వాగతం
- వీడియోను పోస్ట్ చేసిన మాజీ స్టార్ బ్యాట్స్ మన్
- శ్రీలంక లెజెండ్స్, ఇండియా లెజెండ్స్ మధ్య మ్యాచ్
- సిక్సర్లతో వీర విహారం చేసిన యువీ
- ఇండియా లెజెండ్స్ గెలుపులో కీలక పాత్ర
చాలా రోజుల తర్వాత మళ్లీ యువరాజ్ సింగ్ తన బ్యాటింగ్ పవరేంటో చూపించాడు. తనలో సత్తా ఇంకా తగ్గలేదని నిరూపించాడు. ఆదివారం జరిగిన రోడ్ సేఫ్టీ సిరీస్ టీ20 మ్యాచ్ లో శ్రీలంక లెజెండ్స్ పై 60 పరుగులు చేశాడు. ఇండియా లెజెండ్స్ తరఫున బరిలోకి దిగిన అతడు.. సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఆ క్రమంలో అతడి కాలి కండరానికి (మోకాలు కింది భాగం) గాయమైంది.
అయితే, మ్యాచ్ అనంతరం హోటల్ కు వెళ్లిన అతడికి హోటల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. బాహుబలి లెవెల్ లో అతడిని ఆహ్వానించారు. బ్యాగ్రౌండ్ లో బాహుబలి పాట ప్లే అవుతుండగా.. హోటల్ సిబ్బంది వరుసలో నిలబడి అతడికి గార్డ్ పట్టారు. యువీ కూడా డ్యాన్స్ చేస్తూ లోపలికి వెళ్లిపోయాడు. దానికి సంబంధించిన వీడియోను యువీ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. బ్రోకెన్ బాహుబలి అంటూ క్యాప్షన్ పెట్టాడు. తన కుడి కాలికి గాయమైందన్న విషయాన్ని చెబుతూ ఆ పేరు పెట్టాడు.
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా ఆదివారం రాయ్ పూర్ లో ఇండియా లెజెండ్స్, శ్రీలంక లెజెండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇండియా లెజెండ్స్ కు సచిన్ నాయకత్వం వహించగా, శ్రీలంకకు తిలకరత్న దిల్షాన్ కెప్టెన్ గా వ్యవహరించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక లెజెండ్స్ లక్ష్యానికి 14 పరుగుల దూరంలో ఆగిపోయింది.