క‌రోనా వ‌ల్ల పెరిగిన‌ ఒంట‌రిత‌నం.. స‌ర్వేలో వెల్ల‌డి

  • వివ‌రాలు తెలిపిన‌ ఇప్సోస్‌ ఇండియా
  • నగరాల్లో ప్రతి 45 శాతం మందిలో ఒంటరితనం   
  • 28 శాతం పట్టణ ప్రజలు కుంగుబాటుకు గురి
  • ఇంటర్నెట్ ను తెగ వాడేసిన ప్ర‌జ‌లు
మాన‌వాళిని ముప్పుతిప్ప‌లు పెడుతూ ఇప్ప‌టికే ల‌క్ష‌లాది మందిని బ‌లి తీసుకు‌న్న క‌రోనా వైర‌స్.. ప్ర‌జ‌ల‌ను ఆరోగ్య ప‌రంగా, ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీస్తూనే ఉంది. మ‌నుషుల‌పై క‌రోనా ప్ర‌భావం గురించి ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతున్నాయి. ఇప్సోస్‌ ఇండియా చేసిన ఓ స‌ర్వే ఫ‌లితంగా తాజాగా మ‌రో కొత్త విష‌యం వెల్లడైంది. దేశంలో నగరాల్లో నివసించే ప్రతి 45 శాతం మంది క‌రోనా వ‌ల్ల‌ ఒంటరితనాన్ని అనుభవించారని తేలింది.

అలాగే, 28 శాతం మంది పట్టణ ప్రజలు కుంగుబాటుకు గురయ్యారు. దేశంలో ప్ర‌జ‌లు సాధార‌ణంగా త‌మ ప‌క్కింటి వారితో, కార్యాల‌యాల్లో ఉద్యోగులతో సరదాగా మాట్లాడుకుంటూ ఉంటార‌ని, అయితే, లాక్‌డౌన్ కార‌ణంగా వారు కొత్తరకం ఒంటరితనాన్ని అనుభ‌వించార‌ని స‌ర్వేలో తేలింది. వారంతా బలవంతంగా ఏకాంత సమయాన్ని గ‌డ‌పాల్సి వ‌చ్చింది. దాని నుంచి బ‌య‌టప‌డ‌డానికి ఇంటర్నెట్ ను తెగ వాడేశారు.

ఆన్‌లైన్‌లోనే బంధువులతో మాట్లాడుకోవడంతో పాటు స్నేహితుల‌తో గేమ్స్‌ ఆడుకోవడం వంటివి చేశారు. సోషల్ మీడియా, ఓటీటీకి ప్ర‌జ‌లు బాగా అల‌వాటు ప‌డ్డారు. కొంత మంది ఇంట్లోనే కుటుంబ సభ్యులతో గ‌డిపారు. కాగా, కరోనా సంక్షోభంలో తమ కాలనీల్లో పొరుగున ఉండే వ్యక్తుల నుంచి త‌మ‌కు అన్ని రకాలుగా మద్దతు లభించదని 50 శాతం మంది పట్టణ ప్రజలు చెప్పారు.  


More Telugu News