'మ‌హారాష్ట్ర‌లో రాష్ట్రపతి పాలన' అంటూ ప్ర‌చారం.. సంజ‌య్ రౌత్ ఆగ్ర‌హం!

  • ఎన్డీఏకి ఓ హెచ్చరిక చేస్తున్నాను
  • ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను తప్పుదారిలో వాడుకుంటున్నారు
  • రాష్ట్రపతి పాలన విధిస్తే రేగే మంటల్లో మీరు కాలిపోతారు
మ‌హారాష్ట్ర‌లో మ‌రోసారి రాజ‌కీయ వేడి నెల‌కొంది. కేంద్ర ప్ర‌భుత్వంపై శివ‌సేన నేత సంజ‌య్ రౌత్ మండిప‌డ్డారు. మహారాష్ట్ర మంత్రులపై ఇటీవ‌ల వ‌రుస‌గా వ‌చ్చిన ప‌లు ర‌కాల‌ ఆరోపణలు క‌ల‌క‌లం రేపుతోన్న నేప‌థ్యంలో సంజ‌య్ రౌత్ స్పందిస్తూ..  కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను తప్పుదారిలో ఉపయోగించుకుని మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అన్నారు.  

రాష్ట్రపతి పాలన విధించాలన్న‌దే కేంద్ర ప్ర‌భుత్వ ఆలోచ‌న అయితే తాను ఎన్డీఏకి ఓ హెచ్చరిక చేస్తున్నాన‌ని చెప్పారు. 'మ‌హారాష్ట్ర‌లో రాష్ట్రపతి పాలన విధిస్తే రేగే మంటల్లో మీరు కాలిపోతారు' అని వ్యాఖ్యానించారు. కాగా, మ‌హారాష్ట్ర‌లో వ‌రుస‌గా చోటు చేసుకుంటోన్న ప‌రిణామాల వ‌ల్ల ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారనే వార్తలు వ‌స్తున్నాయి. గ‌తంలో ఎన్డీఏ కూట‌మికి గుడ్ బై చెప్పిన శివ‌సేన మ‌హారాష్ట్ర‌లో ఎన్సీపీ, కాంగ్రెస్‌తో క‌లిసి సంకీర్ణ‌ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.


More Telugu News