ప్రజల కన్నీళ్లను చూసి స్పందించినవాడే నిజమైన నాయకుడు: ఈటల రాజేందర్
- నాయకుడికి కులం, భారీ ఆకారం అవసరం లేదు
- నేను ఉన్నంత వరకు ప్రజల రుణం తీర్చుకుంటా
- నేను చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు
ఇటీవలి కాలంలో తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సింది కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని... మనిషిని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోయినా... శాశ్వతంగా ఓడిపోవని చెప్పారు. తాను ఎన్నోసార్లు గాయపడినా... తన మనసును, వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోలేనని అన్నారు.
మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చిందని ఈటల చెప్పారు. రామాయణంలో కూడా రాముడు, రావణుడు ఉన్నారని... మన సమాజంలో కూడా అన్ని రకాల వ్యక్తులు ఉంటారని తెలిపారు. నాయకులకు భారీ ఆకారం, కులం, ఆభరణాలతో అవసరం లేదని... ప్రజల కన్నీళ్లను చూసి స్పందించినవాడే నిజమైన నాయకుడని చెప్పారు. తాను ఉన్నంత వరకు ప్రజల రుణం తీర్చుకుంటూనే ఉంటానని అన్నాడు. తాను చేసిన పనుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదని చెప్పారు.