మ్యాచ్ ఫిక్సింగ్ అభియోగాల నుంచి అజార్ తప్పించుకోలేడు: టీసీఏ చీఫ్ ఎండల
- మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణపై సీబీఐ దర్యాప్తును కోరుతా
- త్వరలోనే అమిత్ షాను కలుస్తా
- ప్రతిభ ఉన్న హైదరాబాద్ ఆటగాళ్లకు అన్యాయం
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చీఫ్ మహ్మద్ అజారుద్దీన్‌పై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల సెలక్షన్స్‌లో పలు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు హైదరాబాద్ జట్టులో స్థానం లభించలేదని అన్నారు. సెలక్టర్ల అక్రమాలపై క్రికెటర్ల తల్లిదండ్రులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. సీబీఐ కేసుల్లో ఉన్న వ్యక్తి తెలంగాణ గ్రామీణ క్రికెటర్లకు న్యాయం చేయలేడని అన్నారు.
అజారుద్దీన్‌పై ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో బీసీసీఐ నుంచి ఆయనకు క్లీన్ చిట్ లభించలేదని గుర్తు చేసిన ఎండల.. ఇప్పుడీ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణల నుంచి ఆయన తప్పించుకోలేరని, త్వరలోనే అమిత్ షాను కలిసి సీబీఐ విచారణ కోరుతామని చెప్పారు.