మరోసారి వార్తల్లోకెక్కిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్
- మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సీఎం
- మన దేశాన్ని అమెరికా పాలించిందని వ్యాఖ్య
- విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ మరోసారి వార్తల్లో నిలిచారు. మన దేశాన్ని అమెరికా 200 ఏళ్లు పాలించిందంటూ పప్పులో కాలేశారు. అలాంటి దేశం ఇప్పుడు కరోనాతో కొట్టుమిట్టాడుతోందని వ్యాఖ్యానించారు. మోదీ మాత్రం కొవిడ్ కట్టడికి చర్యలు తీసుకున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కొందరు మాత్రమే మాస్కు ధరించడం, శానిటైజర్ వాడడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తున్నారంటూ ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
ఇక ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను విమానంలో ప్రయాణిస్తుండగా.. ఓ ఇద్దరు పిల్లల తల్లి చిరిగిన జీన్స్ వేసుకుందని, అలాంటి మహిళ సమాజానికి ఏం సందేశం ఇస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తొలిసారి వార్తలకెక్కారు. దీంతో నెట్టింట పెద్దఎత్తున చర్చ నడిచింది. తాజాగా అమెరికా మన దేశాన్ని 200 ఏళ్ల పాటు పాలించిందంటూ నోరు జారి మరోసారి నెటిజన్లకు చిక్కారు. ‘జీన్స్’ రగడ సద్దుమణగక ముందే ఇది తెరపైకి రావడంతో విమర్శకులు తమ నోళ్లకు పనిచెప్పారు.