కమర్షియల్ సంస్థల నుంచి రుసుము వసూలు చేయనున్న వికీపీడియా!
- వికీ సమాచారాన్ని వినియోగించుకొని ఆదాయం పొందుతున్న సంస్థలు
- వాటి నుంచి మాత్రమే ఛార్జీలు వసూలు
- గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్ వంటి బడా సంస్థలకు వర్తింపు
- దీనికోసం ప్రత్యేక ఏపీఐ టూల్ రూపకల్పన
ఉచితంగా సమాచారం అందించే ఆన్‌లైన్ ఎన్‌సైక్లోపీడియా వికీపీడియా ఇకపై రుసుము వసూలు చేయనుంది. అయితే, మనలాంటి సామాన్యుల నుంచి కాదులెండి! వికీ సమాచారాన్ని తమ ఉత్పత్తుల్లో వినియోగించుకొని లబ్ధి పొందుతున్న గూగుల్, యాపిల్, ఫేస్‌బుక్ వంటి బడా సాంకేతిక సంస్థల నుంచి మాత్రమే ఛార్జీలు వసూలు చేయాలని మాతృసంస్థ వికీమీడియా నిర్ణయించింది.
అయితే, సంస్థల కోసం ప్రత్యేక కాంట్రాక్టులు, కంటెంట్ ఏమీ ఉండదని వికీమీడియా స్పష్టం చేసింది. సమాచారాన్నంతా ప్యాకేజీ రూపంలో ఉంచి ఓ ఏపీఐ టూల్‌ను రూపొందించామని తెలిపింది. దీన్ని సాంకేతిక సంస్థలు తమ ఉత్పత్తులతో అనుసంధానించి వికీ సమాచారాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. దీని ద్వారా వేగంగా ఎక్కువ సమాచారాన్ని యాక్సెస్ చేసే అవకాశం కూడా లభిస్తుందని పేర్కొంది.
చిన్న సంస్థలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వికీమీడియా తెలిపింది. అయితే, కొత్త నిబంధనల వల్ల ప్రస్తుతం అందిస్తున్న ఉచిత సేవల్లో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.