ఏపీలో మహమ్మారి విజృంభణ... మరోసారి 300 దాటిన కరోనా కొత్త కేసులు
- గత 24 గంటల్లో 31,138 కరోనా పరీక్షలు
- 368 మందికి పాజిటివ్
- గుంటూరు జిల్లాలో 79 కేసులు
- ప్రకాశం జిల్లాలో ఆరుగురికి పాజిటివ్
- కోలుకున్న 263 మంది
ఏపీలో కరోనా వైరస్ ప్రభావం మళ్లీ అధికమవుతోంది. మరోసారి 300కి పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి. గడచిన 24 గంటల్లో 31,138 కరోనా పరీక్షలు నిర్వహించగా 368 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 79 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 49, అనంతపురం జిల్లాలో 40, చిత్తూరు జిల్లాలో 40 కేసులు గుర్తించారు. అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 263 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇప్పటివరకు ఏపీలో 8,93,734 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,357 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 2,188 మందికి చికిత్స అందిస్తున్నారు. మొత్తం మరణాల సంఖ్య 7,189గా నమోదైంది.