సినీ రంగంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రానా

  • విలక్షణ పాత్రలతో ముందుకెళుతున్న రానా
  • అరణ్య చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు
  • నటులు, దర్శకుల భాషతో సినీ రంగానికి పట్టింపు లేదన్న రానా
  • ప్రేక్షకులకు సైతం సినిమా కంటెంటే ముఖ్యమని వెల్లడి
ఒకే మూసలో నటించకుండా, విభిన్న పాత్రలు ఎంచుకుంటూ కెరీర్ ను ముందుకు తీసుకెళుతున్న నటుడు దగ్గుబాటి రానా. అరణ్య చిత్రంలో జంగిల్ మ్యాన్ పాత్ర కూడా అలాంటిదే. హిందీలో హాథీ మేరే సాథీ పేరుతో వస్తున్న ఈ చిత్రం ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో రానా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడు కానీ, దర్శకుడు కానీ ఏ భాషకు చెందినవాడన్నది సినీ రంగం పట్టించుకోదని అన్నారు. ఎవరు ఏ భాషకు చెందినవారైనా నిరభ్యంతరంగా అంగీకరించేది ఒక్క సినీ రంగమేనని అభిప్రాయపడ్డారు.

ప్రేక్షకులు సైతం ఒక్కసారి టికెట్ కొనుక్కుని థియేటర్ లోకి వెళ్లారంటే ఆ సినిమా ఎవరు నిర్మించారన్నది పట్టించుకోరని, సినిమాలో ఉన్న కంటెంట్ పైనే దృష్టి నిలుపుతారని రానా వివరించారు. ఉదాహరణకు అవెంజర్స్ సినిమానే తీసుకుంటే అది ఏ భాష అన్నది ప్రేక్షకులు పట్టించుకోరని, సినిమానే ముఖ్యమని పేర్కొన్నారు. భాష సరిహద్దులను ఇంటర్నెట్, మీడియా తొలగించాయని అన్నారు.


More Telugu News