టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో స్థానంలో రోహిత్
- నంబర్ వన్‌గా కోహ్లీ
- మూడో స్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్
- ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్
అంతర్జాతీయ క్రికెట్‌లో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో భారత ఆటగాడు రోహిత్ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు.ఈ జాబితాలో నంబర్ వన్‌గానూ భారత బ్యాట్స్‌మనే ఉండడం గమనార్హం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 3,103 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా, రోహిత్ నిన్నటి టీ20లో 64 పరుగులు చేయడంతో మొత్తం 2,864 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు.
మూడో స్థానంలో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ 2,839 పరుగులతో ఉన్నాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 111 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 4 శతకాలు, 22 అర్ధ శతకాలు ఉన్నాయి. నిన్నటి మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ అద్భుతంగా రాణించి ఇంగ్లండ్‌పై 36 పరుగుల తేడాతో విజయం సాధించి, టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 పరుగులు చేశాడు.