ఇది మరో క్విడ్ ప్రో కోకి తెర లేపడం కాదా?: గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి

  • ఏపీలో ఇసుక తవ్వకాలు, స్టాక్ యార్డ్ నిర్వహణపై విమ‌ర్శ‌లు
  • 'జయప్రకాశ్‌ పవర్ వెంచర్స్' కి క‌ట్ట‌బెట్టారు
  • నష్టాల్లో ఉన్న కంపెనీకి ఇవ్వ‌డం స‌రికాదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇసుక రీచ్ ల్లో తవ్వకాల బాధ్యతలను ఏపీ ప్ర‌భుత్వం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై టీడీపీ నేత గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి స్పందిస్తూ విమ‌ర్శ‌లు గుప్పించారు.

''ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాలు, స్టాక్ యార్డ్ నిర్వహణని 'జయప్రకాష్ పవర్ వెంచర్స్' కి మన ముఖ్యమంత్రి గారు కట్టబెట్టారు. సుమారు రూ.3,500 కోట్లు రెవెన్యూ నష్టాల్లో ఉన్న ఈ కంపెనీకి తవ్వకాలు ఇవ్వడం వెనుక ఏ మర్మం ఉంది? తమ కేసుల్లో ఉన్న వారికి ఇవి గుప్తదానం చేయడం మరో ఎత్తు'' అని ఆయ‌న ఆరోపించారు.

''ఇది మరో క్విడ్ ప్రో కో కి తెర లేపడం కదా? ఆ కంపెనీ నష్టాల్లో ఉంది అనడానికి ఈ వార్త చూస్తే
మీకే అర్థం అవుతుంది జగన్ గారి వ్యాపార దృక్పథం. మొత్తానికి ప్రజలకి మాత్రం ఇసుమంతైన ఇసుక దొరికేనా ముఖ్యమంత్రి జ‌గ‌న్ గారు?'' అని గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి ప్ర‌శ్నించారు. ఓ ఆంగ్ల వెబ్‌సైట్ రాసిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.


More Telugu News