గ్రాడ్యుయేట్లను డబ్బులతో కొన్నారు: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామచంద్రరావు

  • ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు
  • సామాన్యులు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కల్పించారు
  • వాణీదేవి గెలుపు పీవీది
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పట్టభద్రులను డబ్బులతో కొన్నారని ఆరోపించారు. చివరికి సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి కల్పించారని మండిపడ్డారు. ఎన్నికల్లో విజయం సాధించిన సురభి వాణీదేవికి శుభాకాంక్షలు తెలిపిన ఆయన ఈ గెలుపు నిజానికి ఆమెది కాదని, ఆమె తండ్రి పీవీ నరసింహారావుదని అన్నారు.

కాగా, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి రెండో ప్రాధాన్య ఓట్లతో విజయం సాధించారు. ఆమెకు 1,28,010 ఓట్లు రాగా, తన సమీప బీజేపీ అభ్యర్థి రామచంద్రరావుకు 1,19,198 ఓట్లు పోలయ్యాయి.


More Telugu News