ఏపీలో మళ్లీ ప్రబలుతున్న కరోనా... కొత్తగా 380 మందికి పాజిటివ్
- గత 24 గంటల్లో 30,978 కరోనా పరీక్షలు
- అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 కేసులు
- పశ్చిమ గోదావరి జిల్లాలో 5 కేసులు
- 204 మందికి కరోనా నయం
- యాక్టివ్ కేసుల సంఖ్య 2 వేల పైన నమోదు
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అధికమవుతోంది. గడచిన 24 గంటల్లో 30,978 కరోనా పరీక్షలు నిర్వహించగా, 380 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 పాజిటివ్ కేసులు గుర్తించారు. చిత్తూరు జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 51, కృష్ణా జిల్లాలో 44, విశాఖ జిల్లాలో 43 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా తూర్పు గోదావరి జిల్లాలో 5, ప్రకాశం జిల్లాలో 6, కడప జిల్లాలో 8 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో 204 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతి చెందారు. అటు యాక్టివ్ కేసుల సంఖ్య మరింత అధికమైంది. చాన్నాళ్ల తర్వాత 2 వేలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,083 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,93,366 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,84,094 మంది కరోనా ప్రభావం నుంచి విముక్తులయ్యారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,189కి చేరింది.