పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవి గెలుపు

  • ఉత్కంఠ భరితంగా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
  • చివరకు వాణీదేవిదే పైచేయి
  • బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు ఓటమి
  • వాణీదేవికి మొత్తం 1,49,269 ఓట్లు
గత కొన్నిరోజుల నుంచి ఉత్కంఠభరితంగా సాగుతున్న తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగింపు దశకు చేరుకుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రాంచందర్ రావుపై ఆమె గెలుపొందారు. వాణీదేవికి మొత్తం 1,49,269 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు 1,12,689, రెండో ప్రాధాన్యత ఓట్లు 36,580 వచ్చాయి. ఆమె విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే, టీఆర్ఎస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాల్లో వాణీదేవి విజయం సాధించినట్టు ప్రకటించుకుంది. వాణీదేవికి అభినందనలు తెలుపుతూ పోస్టులు పెట్టింది.


More Telugu News