వైసీపీ ఎమ్మెల్యేను కలవడంపై వివరణ ఇచ్చిన టీడీపీ కార్పొరేటర్లు
- ప్రొటోకాల్ ప్రకారమే ఎమ్మెల్యేను కలిశాం
- పార్టీ మారే ఆలోచన మాకు లేదు
- టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యం
విశాఖ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు గాజువాక వైసీపీ ఎమ్మెల్యే నాగిరెడ్డిని నిన్న కలిసిన వ్యవహారం కలకలం రేపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పార్టీ హైకమాండ్ వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై వారు వివరణ ఇచ్చారు. ప్రొటోకాల్ ప్రకారమే ఎమ్మెల్యేను కలిశామని చెప్పారు. జోనల్ కమిషనర్ ను కలిసేందుకు తాము వెళ్లామని తెలిపారు. తమ డివిజన్ల అభివృద్ధికి సహకరించమని కోరేందుకు ఎమ్మెల్యేను కలిశామని చెప్పారు.
వైసీపీ ఎమ్మెల్యేను కలవడంలో తమకు మరో ఉద్దేశం లేదని టీడీపీ కార్పొరేటర్లు తెలిపారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి వల్లే గాజువాకలో తాము గెలుపొందామని చెప్పారు. తమకు పార్టీ మారే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. తమపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని... టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో లేళ్ల కోటేశ్వరరావు, బొండా జగన్నాథం, మొల్లి ముత్యాలునాయుడు, రౌతు శ్రీనివాసరావు, పులి లక్ష్మిబాయి, పల్లా శ్రీనివాస్ ఉన్నారు.