ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో తెలంగాణను విశ్వవ్యాప్తం చేస్తాం: కేటీఆర్

  • ఎలక్ట్రానిక్ రంగానికి ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది
  • 912 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ క్లష్టర్లు ఉన్నాయి
  • 4 లక్షల ఉద్యోగాల కల్పనను లక్ష్యంగా పెట్టుకున్నాం
ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రానిక్ రంగంలో తెలంగాణను విశ్వవ్యాప్తం చేస్తామని చెప్పారు. 912 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ క్లష్టర్లు ఉన్నాయని తెలిపారు. ఎలక్ట్రానిక్ ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఎలక్ట్రానిక్ కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తోందని తెలిపారు. రూ. 70 వేల కోట్ల పెట్టుబడులతో 4 లక్షల ఉద్యోగాల కల్పనను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వివరాలను వెల్లడించారు.


More Telugu News