విద్యార్థుల పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!

  • తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
  • 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు పైతరగతులకు ప్రమోషన్
  • 6 నుంచి 9వ తరగతి వరకు ఆన్ లైన్ భోధనను ప్రారంభించే అవకాశం
దేశ వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తెలంగాణలో సైతం కేసుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతోంది. దీని ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోంది. గత ఏడాది కూడా కరోనా వల్ల 9వ తరగతి వరకు విద్యార్థులను పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేశారు. ఈ ఏడాది కూడా మళ్లీ అదే పరిస్థితి తలెత్తేలా ఉంది. కరోనా నేపథ్యంలో 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మరోవైపు 6, 7, 8 తరగతుల విద్యార్థులకు ప్రత్యక్ష బోధనను నిలిపివేసి, ఆన్ లైన్ ద్వారా బోధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10వ తరగతికి మాత్రం బోర్డు పరీక్షలు ఉన్నందున ప్రత్యక్ష బోధన కొనసాగించే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఈ నెల 22న ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రకటన చేస్తారని తెలుస్తోంది. మరోవైపు కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో, తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


More Telugu News