సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • రష్మిక హిందీ సినిమా 'గుడ్ బాయ్'
  • 'సీటీమార్'కి తమన్నా డబ్బింగ్ పూర్తి
  • సాయితేజ్ సరసన మలయాళ బ్యూటీ     
*  కథానాయిక రష్మిక ప్రస్తుతం హిందీ సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి విదితమే. ఇప్పటికే 'మిషన్ మజ్ను' చిత్రం షూటింగులో కూడా తను పాల్గొంది. మరోపక్క, అమితాబ్ బచ్చన్ తో కలసి మరో సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రానికి తాజాగా 'గుడ్ బాయ్' అనే టైటిల్ని నిర్ణయించారు. ఇందులో అమితాబ్, రష్మిక తండ్రీకూతుళ్లుగా నటిస్తున్నారు.
*  గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న 'సీటీమార్' చిత్రాన్ని ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు. తాజాగా  కథానాయిక తమన్నా తన డబ్బింగ్ పార్టును పూర్తిచేసింది. ఇందులో తన పాత్ర తెలంగాణ యాస మాట్లాడుతుందని తమన్నా చెప్పింది.
*  ప్రస్తుతం కల్యాణ్ రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ఇది పూర్తి కాకుండానే మరో తెలుగు సినిమాలో బుక్కయింది. సాయితేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందే సినిమాలో సంయుక్త కథానాయికగా ఎంపికైనట్టు తెలుస్తోంది.


More Telugu News