వెంటాడిన కరోనా భయం.. దుబాయ్‌లో ఏలూరు యువకుడి ఆత్మహత్య
- గతేడాది జనవరిలో దుబాయ్ వెళ్లిన సత్య సాయినాథ్
- కరోనా సోకడంతో తీవ్ర మనస్తాపం
- 14వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
- కడసారి చూపునకు నోచుకోలేకపోయిన తల్లిదండ్రులు
వెంటాడిన కరోనా భయం నుంచి తప్పించుకోలేకపోయిన ఏలూరు యువకుడు దుబాయ్‌లో భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి స్నేహితుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఏలూరులోని శాంతినగర్‌కు చెందిన గోగినేని సత్యసాయినాథ్ (22) గతేడాది జనవరిలో దుబాయ్ వచ్చి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల అతడిలో స్వల్ప లక్షణాలు కనిపించగా, పరీక్షలు చేయించుకున్నాడు. అందులో అతడికి కరోనా సంక్రమించినట్టు నిర్ధారణ అయింది.
తనకు కరోనా సోకిన విషయాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ నెల 16న తాను నివాసం ఉంటున్న భవనంలోని 14వ అంతస్తు పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన సాయినాథ్ తల్లిదండ్రులు కుమారుడి మృతదేహాన్ని కడసారి చూడాలని తపించిపోయారు. మృతదేహాన్ని ఏలూరు పంపించాలని వేడుకున్నారు. అయితే, పోస్టుమార్టం రిపోర్టులో అతడికి కరోనా ఉన్నట్టు తేలడంతో నిన్న అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు.