తన కొత్త సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ

  • కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి
  • లాక్ డౌన్లపై వార్తలు వస్తున్నాయి
  • 'డి కంపెనీ' విడుదలను వాయిదా వేస్తున్నాం
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 39,726 మంది కరోనా బారిన పడ్డారు. కేంద్ర వైద్యశాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం గత 24 గంటల్లో 154 మంది కరోనా కారణంగా చనిపోయారు. 2,71,282 మంది వివిధ ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో ఉంటూ చికిత్స పొందుతున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం 'డి కంపెనీ' విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 'దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో తీవ్ర స్థాయిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పాటు... కొత్త లాక్ లాక్ డౌన్లపై నిరవధికంగా వస్తున్న వార్తల నేపథ్యంలో, మా 'డి కంపెనీ' విడుదలను వాయిదా వేస్తున్నాం. కొత్త విడుదల తేదీని వీలైనంత త్వరలోనే ప్రకటిస్తాం' అని ఆయన ట్వీట్ చేశారు.


More Telugu News