వైయస్ షర్మిలతో భేటీ అయిన అజారుద్దీన్ కుమారుడు, సానియామీర్జా చెల్లెలు!
- షర్మిలతో భేటీ అవుతున్న పలువురు ప్రముఖులు
- అజార్ కుమారుడు, సానియా చెల్లెలు షర్మిల పార్టీలో చేరబోతున్నట్టు టాక్
- ఏప్రిల్ 9న షర్మిల తన పార్టీని ప్రకటించే అవకాశం
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని వైయస్ షర్మిల ప్రారంభించబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 9న ఖమ్మంలో నిర్వహించనున్న సభలో పార్టీని ఆమె ప్రకటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసే పనిలో పార్టీ నేతలు ఉన్నారు.
మరోవైపు షర్మిలతో పలువురు ప్రముఖులు భేటీ అవుతున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కుమారుడు, టెన్నిస్ స్టార్ సానియామీర్జా చెల్లెలు ఆనంమీర్జా కలసి షర్మిలను ఆమె కార్యాలయంలో కలిశారు. వీరిద్దరూ భార్యాభర్తలు అనే విషయం తెలిసిందే.
వీరు షర్మిల పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ భేటీపై వారు స్పందిస్తూ కేవలం మర్యాదపూర్వకంగానే షర్మిలను కలిశామని చెప్పారు. మరికొందరు సెలబ్రిటీలు కూడా షర్మిల పార్టీపై ఆసక్తిని చూపుతున్నట్టు సమాచారం. ఏదేమైనప్పటికీ, పార్టీని ఇంకా ప్రకటించక ముందే షర్మీల పార్టీపై ఇరు తెలుగు రాష్ట్రాల్లో అమితమైన ఆసక్తి నెలకొంది. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకురావడమే తన లక్ష్యమని ఆమె చేసిన ప్రకటన... పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ పెంచుతోంది. తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని షర్మిల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.