నిలిచిపోయిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- ఓట్ల లెక్కింపు సందర్భంగా గందరగోళం
- 8 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ లో 50 ఓట్లు గల్లంతు
- అభ్యంతరం వ్యక్తం చేసిన బీజేపీ, కాంగ్రెస్ ఏజెంట్లు
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆగిపోయింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సందర్భంగా గందరగోళం నెలకొంది. దీంతో, అధికారులు ఓట్ల లెక్కింపును ఆపేశారు. 8 మంది అభ్యర్థుల ఎలిమినేషన్ లో 50 ఓట్లు గల్లంతయినట్టు తేలడంతో లెక్కింపును నిలుపుదల చేసినట్టు అధికారులు తెలిపారు. ఓట్లు గల్లంతయినట్టు తేలడంతో విపక్ష బీజేపీ, కాంగ్రెస్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్వోకు ఫిర్యాదు చేశారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి ఇప్పటి వరకు ముందంజలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బీజేపీ ఉంది.