అపరాధులకు ఏ మతమూ ఉండదు: ఒవైసీకి యోగి కౌంటర్

  • అపరాధులను క్షమించే ప్రసక్తే లేదు
  • నాలుగేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాం
  • కరోనాను సమర్థంగా ఎదుర్కొనే స్థాయికి వచ్చాం
యూపీలో జరిగిన ఎన్ కౌంటర్లను తప్పుపడుతూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. తప్పు చేసినవాడు అపరాధేనని... వారికి ఏ మతమూ ఉండదని చెప్పారు. అపరాధులను క్షమించే ప్రసక్తే లేదని అన్నారు. జీరో టాలరెన్స్ విధానంపై కృషి చేస్తున్నామని చెప్పారు.

గత నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో అనేక మార్పులను తీసుకొచ్చామని యోగి తెలిపారు. 2017లో తాము అధికారంలోకి వచ్చినప్పుడు కొందరికి ఓటు హక్కు కూడా లేదని, రోడ్లు లేవని, పాఠశాలల్లో మౌలికవసతులు లేవని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లలో పరిస్థితిని మార్చామని తెలిపారు. గతంలో ఆరోగ్యశాఖలో ఎలాంటి సదుపాయాలు లేవని... ఇప్పుడు పరిస్థితి మారిందని, కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనే పరిస్థితిని తీసుకొచ్చామని చెప్పారు.

టూరిజం రంగంలో కూడా రాష్ట్రం పురోగమిస్తోందని... ప్రయాగ్ రాజ్ కుంభమేళాతో మొదలు రామమందిర నిర్మాణం వరకు ముందుకు సాగుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధిని సాధిస్తామని చెప్పారు.


More Telugu News